ETV Bharat / state

కానుకలు అమ్మవారివి.. కాజేస్తోంది "అయ్యవారు.."

భక్తులు ఎంతో నమ్మకంతో స్వామికి సమర్పించుకుంటున్న కానుకలను ఓ పూజారి కాజేస్తున్నారు. కృష్ణా జిల్లా శ్రీ తిరుపతమ్మ ఆలయంలో పూజారి చేతివాటాన్ని ఆలయ ఇంజినీరింగ్​ అధికారులు పసిగట్టారు. విధుల నుంచి తప్పించారు.

పూజారి చేతివాటాన్ని పసిగట్టిన ఆలయ అధికారులు
author img

By

Published : Oct 21, 2019, 7:05 PM IST

Updated : Oct 22, 2019, 11:27 PM IST

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. కానుకలు రూపంలో భక్తులు పెద్ద మొత్తంలో బంగారాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. అయితే దేవుడికి చెందాల్సిన కానుకలను ఓ పూజారి కాజేశారు. ఉప ప్రధాన అర్చకుడిని విధుల నుంచి తొలగించారు. భక్తులు ఇచ్చిన బంగారు కానుకలను హుండీలో వేయకుండా దాచుకున్నట్లు ఆలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆదివారం దేవాలయానికి వచ్చిన భక్తుల బంగారు ఉంగరం పోయిందని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే క్రమంలో పూజారి మర్రిబోయిన ద్వారకరావు కొన్ని బంగారు వస్తువులను హుండీలో వేయకుండా దాచుకున్నట్లు ఇంజనీరింగ్​ అధికారులు గుర్తించారు. దీంతో అతనిని ప్రశ్నించగా తన వద్దే ఉన్నాయని సమాధానం ఇచ్చాడని అధికారులు తెలిపారు. ఈ విషయమై ఆలయ అధికారులు వెంటనే విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారిని విధుల నుంచి తొలగించారు. అతనికి సహకరించిన మరో ఇద్దరికి, ఆలయ ఇన్‌స్పెక్టర్​కు మెమో జారీ చేశారు.

ఇదీ చదవండి :

తీవ్ర మనస్తాపంతో పూజారి ఆత్మహత్యాయత్నం

Intro:ap_vja_23_21_thirupathamma_tempul_chethivatam_ap10047

Body:తిరుపతమ్మ ఆలయం లో చేతివాటం

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగ స్వామి. తిరుపతమ్మ ఆలయం లో పూజారి చేతివాటం. సి సి టీవీ పుట్టే జి ద్వారా గుర్తించిన ఆలయ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. పూజారిని విధుల నుంచి తొలగింపు. కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంలో ఉప ప్రధాన అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్న మర్రి బోయిన ద్వారక రావు ప్రధాన ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ భక్తులు ఇచ్చిన బంగారు కానుకలను హుండీలో వేయకుండా దాచుకున్నట్లు ఆలయ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆదివారం దేవాలయానికి వచ్చిన భక్తుల బంగారు ఉంగరం పోయిందని ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఇంజనీరింగ్ అధికారులు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించే క్రమంలో ప్రధాన ఆలయంలో పూజారి మర్రి బోయిన ద్వారక రావు కొన్ని బంగారు వస్తువులను హుండీలో వేయకుండా దాచుకున్నట్లు గుర్తించారు. దీంతో అతనిని ప్రశ్నించగా తన వద్దే ఉన్నాయని సమాధానం ఇచ్చాడు. ఈ విషయమై ఆలయ అధికారులు వెంటనే విచారణ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు బంగారు కానుకలను దాచి నందుకు పూజారిని విధుల నుంచి తొలగించారు. అతనికి సహకరించిన మరో ఇద్దరికీ, ఆలయ ఇన్స్పెక్టర్కు మెమో జారీ చేశారు . పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది ఈ విషయమై సదరు అర్చకుడు ద్వారకా రావు ఈటీవీ భారత్ సంప్రదించగా తాను విధుల్లో లేనప్పుడు గుర్తుతెలియని భక్తులు వేరే వారికి ఇవ్వగా అవి నాకు ఇచ్చారని తెలిపారు. అయినప్పటికీ వస్తువులు ఇచ్చిన భక్తుల చిరునామా కనుక్కునేందుకు ప్రయత్నించానని చెప్పారు.
Last Updated : Oct 22, 2019, 11:27 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.