ETV Bharat / state

Price Rise of Essential Commodities: భగ్గుమంటున్న నిత్యావసర ధరలు.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు - Increase in essential commodities

Price Rise of Essential Commodities: నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. ఒకపక్క ఇంటి అద్దెలు, మరోపక్క పిల్లల చదువులు, ఇంకోపక్క అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. వచ్చిన జీతం తమ అవసరాలకు సరిపోక అప్పులపాలవుతున్న పరిస్థితుల్లో.. పేద, మధ్య తరగతి ప్రజలున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడమే పెద్ద యుద్ధంగా మారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Increase in prices of essential commodities
భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు
author img

By

Published : May 23, 2023, 7:03 AM IST

భగ్గుమంటున్న నిత్యావసర సరుకుల ధరలు

Price Rise of Essential Commodities: 'ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగన్నా.. ధరలు మీద ధరలు పెరిగె నాగులో నాగన్న' అనే ఆర్. నారాయణమూర్తి సినిమాలో పాట ఎంత మందికి గుర్తుంది. ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజల బతుకులు అలాగే మారాయి. పప్పులు, ఉప్పు, వంటనూనె వంటి ధరలు ఆకాశానికి పరుగులు పెడుతుండడంతో ప్రజలు బతుకెళ్లదీయలేక పడుతున్న పాట్లు అన్నీఇన్నీ.. కాదు. ఇలా గ్రామాల్లో ఉపాధిలేక నగరాలకు వలసొచ్చిన వేతన జీవులు అధిక ధరలతో పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.

ప్రజల సమస్యలు ఇలా ఉంటే వ్యాపారులు బాధలు మరోలా ఉన్నాయి. ఏ రోజుకి ఏ ధర ఉంటుందో తెలియట్లేదని, ఒకేసారి ఎక్కువ మోతాదులో సరుకులు కొనుగోలు చేస్తే.. ఒకవేళ వాటి ధరలు తగ్గితే తాము నష్టపోతామనే భయంలో ఉన్నామని చెబుతున్నారు. ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొనుగోలు చేసే సరుకులు మోతాదు తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో తమ వ్యాపారాలు దెబ్బుతింటున్నాయని వాపోతున్నారు.

రోజువారీ కూలీ చేసుకునే వారికి చేతి నిండా పనులు దొరకడం లేదు. దీనికితోడు నిత్యావసరాల ధరలు నెలల వ్యవధిలోనే పెరిగిపోతున్నాయి. దీంతో కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కూలీ పనులు, ఇతర చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారికి జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే.. పప్పు, ఉప్పు, వంటనూనె ధరలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో తాము ఏమి తిని బతకాలని సామాన్యులు వాపోతున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా జీవనం సాఫీగా సాగడం లేదని మధ్యతరగతి ప్రజలు చెబుతున్నారు.

పిల్లల చదువులు, అనారోగ్య సమస్యలు, సరైన ఉపాధి అవకాశాలు లేక కుటుంబాలను పోషించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు, వంటనూనె, పంచదార, చింతపండు వంటి సరుకులు అందజేసేవారని.. ప్రస్తుతం కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు చెబుతున్నారు. రేషన్ సరుకుల్లో కోత విధించడంతో కుటుంబాన్ని పోషించడం మరింత ఇబ్బందికరంగా మారుతోందని పేదలు వాపోతున్నారు.

నెల రోజుల వ్యవధిలో కందిపప్పు, మినపగుళ్లు ధరలు సుమారు 20రూపాయలు పెరిగాయి. వంట నూనె ధర అదేతోవలో పయణిస్తోంది. వీటితో పాటు కారం, పసులు, దినుసులు ఇతర సరుకులతో పాటు కూరగాయల ధరలు పైపైకి పాకుతున్నాయి. నిత్యావసర ధరల పెరుగుదలపై నియంత్రణ విధించడంలో ప్రభుత్వం విఫలమయ్యిందన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి.

"పప్పులు, నూనెలు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. మా ఇంట్లో నా భర్త, నేను ఇద్దరం కష్టపడుతున్నా కూడా ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు రేషన్​ షాపులో కందిపప్పు, పంచదార, చింతపండు వంటి నిత్యావసర సరుకులు కొద్దికొద్దిగా అయినా ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం తప్ప ఇంకేం ఇవ్వట్లేదు." -రమణ, విజయవాడ నివాసి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.