ETV Bharat / state

అంచనాలపై వాదనలు వినిపించేందుకు అధికారుల కసరత్తు - Polavaram Project latest news

నవంబర్ రెండున హైదరాబాద్​లో జరిగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సమావేశంలో తమ వాదనలు వినిపించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపే విధంగా తమ వాణిని వినిపించాలని నిర్ణయించారు. మరో వైపు 2013-14లోని అంచనా ప్రకారమే డబ్బు చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేస్తోంది.

preparing of officers to hear arguments on Polavaram estimates
పోలవరం అంచనాలపై వాదనలు వినిపించేందుకు అధికారుల కసరత్తు
author img

By

Published : Oct 30, 2020, 11:51 PM IST

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల అంశంపై వాదన వినిపించేందుకు జలవనరులశాఖ సిద్ధమవుతోంది. నవంబరు 2న హైదరాబాద్​లో జరిగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సమావేశంలో రాష్ట్రం తరఫున గట్టిగా వాణి వినిపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. రూ. 55,548 కోట్ల సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినట్టుగా... పార్లమెంటులో జలశక్తి శాఖ ప్రకటించిన అంశాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. ఈ సమావేశానికి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్​దాస్ సహా పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

2014 నాటికి ఉన్న ప్రాజెక్టు పనుల అంచనాను 2017-18 షెడ్యూల్డ్ స్టాండర్డ్ రేట్ ప్రకారం రూ.55,548 కోట్లుగా జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించింది. అయితే ఈ అంచనాలను జలశక్తి శాఖ సమీక్షించి రూ.47,725.74 కోట్లుగా తేల్చింది. ఈ మొత్తాన్ని ఆమోదించాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖకు నివేదిక పంపారు. దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ 2013-14లోని అంచనా ప్రకారం రూ. 20,398.61 కోట్లనే చెల్లిస్తామని స్పష్టం చేసింది. దీన్ని నిర్ధారించాలంటూ పీపీఏకు సమాచారం అందించింది. ఈ పరిస్థితుల్లో నవంబరు రెండున జరిగే సమావేశంలో అంచనా విలువను సమీక్షించి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

ఇదీచదవండి.

నాగార్జున సాగర్‌లో కొనసాగుతున్న గరిష్ఠ స్థాయి నీటి నిల్వ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.