కృష్ణా జిల్లాలో ఫిబ్రవరి 9న మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్సులను అధికారులు సిద్ధం చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాలకు అవసరమైనన్ని బ్యాలెట్ బాక్సులను మండల పరిషత్ కార్యాలయంలో నిల్వ చేశారు. సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలన చేసి వాటికి అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలోని.. నందిగామ, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు మండలంలోని 79 గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను రెడీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: