ETV Bharat / state

suicide: కుటుంబ కలహాలతో గర్భిణి ఆత్మహత్య - woman commits suicide at Billapadu in krishna district

కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై.. లావణ్య(27) అనే ఆరు నెలల గర్భిణి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బిల్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

కుటుంబ కలహలతో గర్భిణీ ఆత్మహత్య
కుటుంబ కలహలతో గర్భిణీ ఆత్మహత్య
author img

By

Published : Jun 27, 2021, 2:15 PM IST

Updated : Jun 27, 2021, 3:42 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ మండలం బిల్లపాడు గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో కలత చెందిన లావణ్య (27) అనే ఆరు నెలల గర్భిణి.. ఆత్మహత్య చేసుకుంది. లావణ్యకు బిల్లపాడుకు చెందిన నవీన్​తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పారు.

శుక్రవారం రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవ జరిగిందని.. మనస్థాపం చెందిన లావణ్య.. ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రూరల్ మండల పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Accident: శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ప్రమాదం.. ఆర్టీసీ బస్సు-కారు ఢీ

Last Updated : Jun 27, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.