కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో అన్న తిట్టాడని మనస్థాపంతో... ఓ నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. మెరైన్ కానిస్టేబుల్ గోరిపర్తి పాండురంగారావు కుమార్తె నాగ భార్గవికి పదిహేను నెలల క్రితం హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేసే ...నెరుసు సాయి శంకర్‌తో వివాహమైంది. కొద్ది నెలలక్రితం భార్గవి గర్భం దాల్చింది. ఆసుపత్రికి తీసుకెళ్తే.. ఆమెకు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. అందుకే ఆమె వక్కలగడ్డలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి అక్కడే ఉంటోంది.
ఆదివారం ఉన్నట్టుండి భార్గవికి, ఆమె ఆన్న నిఖిల్‌కు వాగ్వాదం జరిగింది. ఆతని మాటలకు మనస్థాపానికి గురైన ఆమె వంటింట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పుడే ఇంటిలోకి వెళ్లిన తల్లి నాగలక్ష్మి ....నాగభార్గవి ఉరికి వేలాడుతుండటంతో హతాశురాలైంది. ఇరుగు పొరుగును పిలిచి వెంటనే..ఆమెను మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోనే భార్గవి మృతి చెందడంతో... తిరిగి చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతురాలి తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు చల్లపల్లి ఎస్ఐ. డి.సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు..
ఇదీ చూడండి.