కృష్ణా జిల్లాలో..
విజయవాడలో ఓ ప్రైవేటు విద్యాసంస్థలో సెమీ క్రిస్టమస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కళాశాల యజామాన్యం పాఠశాల ఆవరణలో కేకు కట్ చేశారు. చిన్నారుల నృత్యాలు అలరించాయి.
ప్రకాశం జిల్లాలో..
క్రిస్మస్ పండుగ సందర్భంగా వేడుకలకు ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం సిద్ధమవుతోంది. చీరాల, వేటపాలెం మండలాల్లోని చర్చిలన్నింటినీ ముస్తాబు చేస్తున్నారు. రహదార్లలోని కూడళ్లలో ఏసు రాకను స్వాగతిస్తూ నక్షత్రాలు ఏర్పాటు చేశారు. వేటపాలెంలోని ఆర్ సీఎం చర్చి వద్ద ఏర్పాటు చేసిన స్టార్లు ఆకట్టుకుంటున్నాయి. చీరాల పట్టణంలోని దుకాణాలు కొనుగోలుదార్లతో సందడిగా మారాయి. రంగురంగుల స్టార్లను, క్రిస్మస్ పండుగ అలంకరణ సామగ్రి, శాంతాక్లాజా బొమ్మలను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు.
అనంతపురం జిల్లాలో..
జిల్లాలోని గుంతకల్లులో అనధికారికంగా ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారంటూ భాజాపా అడ్డుకుంది. కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు ఇరు వర్గాలకు సముదాయించడానికి యత్నించినా ఫలితం లేకుండాపోయింది. చివరకు ఆందోళన చేస్తున్నవారిని బలవంతంగా అదుపులోకి తీసుకొని పట్టణంలోని రెండవ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడే ప్రభుత్వ కార్యాలయంలోనే క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే వై. వెంకట రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మతాలు శాశ్వతం కాదని మనుషులు శాశ్వతం అని...మనది భారతదేశమని ఇక్కడ అన్నీ మతాల వారు ఒకటిగా కలిసి ఉంటారని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో..
ప్రజల జీవితాలు ... క్రిస్మస్ వేడుకల మాదిరిగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ చింతా అనురాధ అన్నారు. పి గన్నవరంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ఆమెతోపాటు, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సమాజంలో తోటివారికి సాయపడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇదీచూడండి.మందడంలో రోడ్లపైనే బల్లలేసుకొని కూర్చున్న అమరావతి రైతులు