కరోనా సంబంధిత విధుల్లో పాల్గొంటూ వైరస్ సోకి మృతిచెందిన ఉద్యోగులకు కేంద్రం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్’ ప్యాకేజీ కింద రూ.50 లక్షల చొప్పున బీమా పరిహారం ఇస్తోంది. దీనిని ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటిదాకా ఆర్టీసీలో 18 మంది సిబ్బంది కరోనాతో మృతిచెందారు. వారి వివరాలను ఆయా జిల్లాల్లోని రీజనల్ మేనేజర్లు, సంబంధిత బీమా కంపెనీకి అందించాలని ఆర్టీసీ పరిపాలన ఈడీ సోమవారం ఆదేశించారు. కరోనా రోగుల తరలింపు, తదితర విధుల్లో ఉద్యోగులు ఎవరైనా పాల్గొని ఉంటే, వారికి పరిహారం వచ్చే వీలుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి