ETV Bharat / state

Suicide: పోస్టుమాస్టర్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి - కృష్ణా జిల్లా పొట్టిపాడులో పోస్టుమాస్టర్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం

అప్పుల బాధ భరించలేక పోస్టల్‌ ఉద్యోగి దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో జరిగింది. స్థానిక పోస్టుమాస్టర్ రఘుబాబు పలు ఆరోపణలపై కొన్ని రోజుల క్రితం సస్పెండయ్యారు. దీంతో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయగా.. వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేస్తుండటంతో ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. రఘుబాబు మరణించగా.. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

postmaster and his wife suicide attempt at pottipadu in krishna district
పోస్టుమాస్టర్‌ దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి
author img

By

Published : Jun 15, 2021, 4:47 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడులో అప్పుల బాధ భరించలేక పోస్టల్‌ ఉద్యోగి దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. స్థానిక పోస్టుమాస్టర్‌ రఘుబాబు కొన్నిరోజుల క్రితం పలు ఆరోపణలపై సస్పెండ్‌ అయ్యారు. కుటుంబ అవసరాల కోసం.. పలువురి నుంచి తీసుకున్న అప్పు తీర్చేందుకు గడువు కోరాడు. వెంటనే చెల్లించాలని వడ్డీ వ్యాపారులు ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.

పెద్దఅవుటుపల్లిలోని ఓ ప్రైవేటు గృహంలో.. రఘుబాబు దంపతులు పురుగుల మందు తాగారు. స్థానికుల సమాచారంతో.. బాధితులను ఆత్కూరు పోలీసులు ఆసుపత్రికి తరలించారు. విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రఘుబాబు మృతి చెందగా..అతని భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెలలో రఘుబాబు తిరిగి విధుల్లో చేరనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

ఇదీ చదవండి: Firing: కాల్చి చంపాడు.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.