కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారులో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. నగరంలోకి అక్రమ మద్యం రవాణా అవుతుందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా విశాఖ జిల్లా అరకు నుంచి గంజాయి తీసుకొస్తున్న కారును పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 21 కేజీల గంజాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి... కారును సీజ్ చేశారు.
ఇదీ చూడండి. బ్లీచింగ్ స్కాం: గుంటూరు డీపీవో సస్పెన్షన్