కృష్ణా జిల్లా వ్యాప్తంగా నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్ల పరిధిలోని మొత్తం 123 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. 868 లీటర్ల సారా నిల్వలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. నాటు సారాతో పట్టుబడిన వారిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మద్యపాన నిషేధం అమలు దిశగా గ్రామాల్లోని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇవీ చదవండి