యువతిపై లైంగిక వేధింపుల కేసులో విజయవాడ ప్రభుత్వాసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాంచారయ్యను పోలీసులు విచారించారు. తనను నాంచారయ్య లైంగికంగా వేధించాడంటూ నూతన ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే యువతి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు 41 సీఆర్పీసి కింద నాంచారయ్యకు నోటీసులు జారీ చేశారు. అతనిని దిశ పోలీస్ స్టేషన్‌లో మూడున్నర గంటల పాటు విచారించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించినట్లు తెలిసింది.
నాంచారయ్య తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సమర్పించారు. ఆధారాలన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామని, నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని దర్యాప్తు అధికారులు తెలిపారు. జేసీ మాధవీలతతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ కూడా ఈ ఘటనపై విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక అందజేయనుంది.
ఇవీ చదవండి...