ETV Bharat / state

Rahul Murder Case: రాహుల్ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు.. - rahul murder case news

Rahul Murder Case
Rahul Murder Case
author img

By

Published : Aug 22, 2021, 3:31 PM IST

Updated : Aug 22, 2021, 4:09 PM IST

15:26 August 22

Rahul Murder Case

విజయవాడలో రెండ్రోజుల క్రితం హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కేసులో కీలక నిందితుడుగా భావిస్తున్న కోరాడ విజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్‌ను పోలీసులు.. రహస్యంగా విచారిస్తున్నారు. రాహుల్ హత్య కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. హంతకుల కోసం నాలుగు రోజులుగా పోలీసులు వెతుకుతున్నారు.

రాహుల్ హత్య.. ఆ రోజు ఏం జరిగింది?

విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం గురువారం కలకలం రేపింది. దర్యాప్తులో హతుడు పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ (29) అని తేలింది. వ్యాపార వాటాల్లో వివాదమే ఇందుకు కారణమని, వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కోరాడ విజయ్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌.. స్వదేశానికి వచ్చాక.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు. పోరంకిలో వారు నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు చెప్పారు. ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం వచ్చింది. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి, భోరున విలపించారు.

అనుబంధ కథనం

RAHUL MURDER CASE:నా కుమారుడి హత్యలో వారికి భాగం: రాహుల్ తండ్రి రాఘవరావు

Last Updated : Aug 22, 2021, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.