నిన్న మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గురించి మాట్లాడితే తన చేతిలో దెబ్బలు తప్పవని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉమ.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపడతానని.. దమ్ముంటే తనను అడ్డుకోవాలని ప్రతి సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలో దేవినేని ఉమ ఇంటి వద్ద, ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీగా పోలీసుల మోహరించారు. గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీసు యాక్టు 30 అమల్లో ఉందని తెలిపారు. దేవినేని ఉమ నిరసనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దేవినేని ఇంటి వద్దకు రాకుండా కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇంటికి వెళ్లే మార్గాల వద్ద బారికేడ్లు పెట్టి అనుమతించట్లేదు.
ఇదీ చదవండి: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక నిలిపేయాలని కోరడమేంటి?