కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ విజయవాడలో కట్టుదిట్టంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న పోలీసులు... అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నగరంలో నిత్యావసరాల కొనుగోలు కోసం సమయం కేటాయించగా... ఆ తర్వాత సమయాల్లో రోడ్లపైకి ఎవరూ రాకుండా కట్డడి చేస్తున్నారు. 9 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ప్రతి వాహనదారుడిని వివరాలు తెలుసుకుంటున్నారు. ఏ పనిమీద వెళ్తున్నారో తగిన సమాచారం ఇవ్వటంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలు చూపితేనే అనుమతిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏ కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను ఫొటోలు తీసి కేసులు నమోదు చేస్తున్నారు.
లాక్డౌన్ను అతిక్రమిస్తే కఠిన చర్యలు... వాహనదారులకు పోలీసుల కౌన్సిలింగ్
విజయవాడలో లాక్డౌన్ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వ్యవధిలోనే నిత్యావసర సరుకుల కొనుగోలు చేయాలని ఇప్పటికే అధికారులు సూచించారు. ఆ తరువాత సమయాల్లో రోడ్లపైకి వచ్చేవారిపై, మాస్కులు లేకుండా తిరిగేవారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ విజయవాడలో కట్టుదిట్టంగా కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలులో కీలకంగా వ్యవహరిస్తున్న పోలీసులు... అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నగరంలో నిత్యావసరాల కొనుగోలు కోసం సమయం కేటాయించగా... ఆ తర్వాత సమయాల్లో రోడ్లపైకి ఎవరూ రాకుండా కట్డడి చేస్తున్నారు. 9 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ప్రతి వాహనదారుడిని వివరాలు తెలుసుకుంటున్నారు. ఏ పనిమీద వెళ్తున్నారో తగిన సమాచారం ఇవ్వటంతో పాటు అందుకు సంబంధించిన పత్రాలు చూపితేనే అనుమతిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏ కారణం లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను ఫొటోలు తీసి కేసులు నమోదు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కృష్ణా జిల్లాలో లాక్డౌన్ మరింత కఠినం