కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న బెజవాడలో కొద్ది రోజుల కిందట జరిగిన గ్యాంగ్ వార్ కలకలం రేపింది. 2 వర్గాలు కొట్టుకున్న ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందాడు. కరోనా నేపథ్యంలో పోలీసులు తీరిక లేకుండా ఉండటంతో రౌడీషీటర్లు మళ్లీ తమ పనులు మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడ శివారు నున్న గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తి మార్చుకోవాలని లేకపోతే నగర బహిష్కరణ తప్పదని సీఐ ప్రభాకర్ వారిని హెచ్చరించారు.
ఇవీ చదవండి...: కుటుంబ కలహాలు..కుమార్తెతో సహా తల్లి ఆత్మహత్య