కృష్ణా జిల్లా నందిగామలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని రవాణా చేస్తున్న 10 ఆటోలను సీజ్ చేశారు. వాహనదారులు లైసెన్స్ లేకుండా నడపరాదని, 18 సంవత్సరాలు దాటని వారికి వాహనాలు ఇవ్వవద్దన్నారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం, ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రయాణికులు కూడా అశ్రద్ధతో త్వరగా గమ్యస్థానాలకు వెళ్లే తొందరలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉన్న ఆటోల్లో ప్రయాణించ వద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు.
వ్యవసాయ కూలీలు పనుల నిమిత్తం ఆటోలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పరిమితికి మించి ఆటోలో ప్రయాణించ వద్దని తెలిపారు. రోడ్డు రవాణా చట్టాలను అతిక్రమించి నడుపుతున్న 10 ఆటోలను సీజ్ చేసిన ఆటోలను రవాణాశాఖాధికారులకు స్వాధీనపరుస్తామన్నారు. ఇటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన కూలీల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ