కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్ లేని బైక్‌పై ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న యువకుడిని ఆపి.. వాహన పత్రాలు చూపించాలని ప్రశ్నించారు. బండి పక్కకు తీసుకెళ్లి ఆపి.. ఆ తర్వాత పారిపోయాడు. బైక్ మీద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేసిన పోలీసులు.. 6 కేజీలు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి...