ETV Bharat / state

మహిళ హత్య కేసు.. 24 గంటల్లో ఛేదన, ఇద్దరు నిందితులు అరెస్ట్ - కృష్ణాజిల్లా నేర వార్తలు

కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని తోలుకోడులో హత్యకు గురైన మల్లాది నాగేంద్రమ్మ కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు.

తోలుకోడు మహిళ హత్య కేసును చేధించిన పోలీసులు

author img

By

Published : Jun 24, 2021, 10:51 PM IST

కృష్ణా జిల్లా మైలవరం మండలం తోలుకోడులో హత్యకు గురైన మల్లాది నాగేంద్రమ్మ హత్యకేసును పోలీసులు చేధించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు 24 గంటల్లో కేసును ఛేదించామని తెలిపారు. 8 బృందాలుగా ఏర్పడి నిందుతులను పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రాథమిక ఆధారాల మేరకు హత్య కేసుగా నమోదు చేశామన్న డీఎస్పీ... ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలిస్తున్నామన్నారు.

తమ విచారణలో నిందితులు ఇంకొల్లు మరియదాసు, మండల నాగేశ్వరరావు హత్యచేసినట్లు అంగీకరించారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరు హత్య చేయబడ్డ మల్లాది నాగేంద్రమ్మకు సమీప బందువు. ఇద్దరు నిందితులిద్దరూ... అదే గ్రామానికి చెందిన వారని స్పష్టం చేశారు. కేవలం మద్యం మత్తులోనే వారు... నాగేంద్రమ్మను హత్య చేశారని తెలిపారు. మరికొన్ని నివేదికలు రావాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. అవి అందిన తర్వాతే అత్యాచారం జరిగిందా.. లేదా అనే విషయాన్ని తెలుపుతామన్నారు. త్వరిత గతిన కేసును చేధించిన పోలీస్ సిబ్బందికి.. రివార్డులకు సిఫార్స్ చేశామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

ప్రతిధ్వని: కరోనా సెకండ్‌ వేవ్‌ ముగిసిందా? ఇంకా కొనసాగుతోందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.