పోలీసుల తరఫున వలస కూలీలకు బాసటగా నిలుస్తున్నామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీస్ శాఖ తరఫున వారికి మాస్క్‌లు, శానిటైజర్, చెప్పులు, పౌష్టికాహారం అందజేస్తున్నామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 3 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని... బంగాల్ వాసులు విజయవాడ పటమటలో వారి పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. కావాలనే కొందరు వారిని రెచ్చగొట్టారని... వారికి తగిలిన దెబ్బలు కొట్టినవి కాదని, లాఠీలు వాడలేదని ఆయన స్పష్టం చేశారు.
వలస కూలీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరుస్దామని ఆయన వివరించారు. రాజకీయపక్షాలు లాక్‌డౌన్ టైమింగ్స్ పాటించాలని... కొత్త సడలింపుల ప్రకారం ముందుకు వెళతామని వివరించారు.