కృష్ణా జిల్లా గుడివాడలోని సినిమా థియేటర్లలో రెవిన్యూ, పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన జీఓ ప్రకారం ఆర్డీఓ శ్రీను కుమార్ ఆధ్వర్యంలో థియేటర్లలో సౌకర్యాలపై ఆరా తీశారు. ఇప్పటికే పట్టణంలోని తొమ్మిది థియేటర్లను తనిఖీ చేసిన బృందం.. సౌకర్యాలపై యజమానులకు పలు సూచనలు చేశారు. తాజాగా పట్టణంలో ఏలూరు రోడ్డులో బొమ్మరిల్లు మినీ థియేటర్ను సోదా చేసి పలు నిబంధనలు ఉల్లంఘించారంటూ సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో ఎమ్మార్వో శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చలి చంపుతున్న వేళల్లో.. పర్యాటకులందరూ మన్యంలో..!