భూతాపంతో ప్రమాద ఘంటికలు మోగుతున్న సమయంలో.. పర్యావరణానికి మరో ముప్పు ప్లాస్టిక్ రూపంలో పొంచి ఉంది. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఇతర వస్తువుల వినియోగం విస్తృతమై.. పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. విచ్ఛలవిడిగా ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తూ... కాలుష్యానికి కారకులౌతున్నారు. ప్రభుత్వం ప్లాస్టిక్ నిర్మూలనకు ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజల నుంచి మాత్రం సహకారం అంతంతమాత్రంగా ఉంది.
మన విజయవాడ!
ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దే క్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగరపాలక కమిషనర్ ప్రసన్న వెంకటేష్ 'మన విజయవాడ' కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా ప్లాస్టిక్ అవరోధాన్ని కలిగిస్తోంది. ఆ కారణంగా భూసారం తగ్గిపోతుంది. ఈ విషయాన్ని వివరిస్తూ... ప్రజలు చైతన్యవంతులై విజయవాడను పరిశుభ్రంగా ఉంచాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అధికారులు చేబుతున్నా... ఆచరణలో మాత్రం ఆశించిన ఫలితం కనిపించడంలేదు. ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై పూర్తిస్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా కవర్ల వాడకం వదిలేయండి.. అంటే ఎలా అంటూ సగటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జ్యూట్ బ్యాగుల పంపిణీ
ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో పైలెట్ ప్రాజెక్టుగా మన విజయవాడ కార్యక్రమాన్ని ఎంచుకున్నారని.. ఇప్పటికే వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర కార్యాలయాల్లో ఉద్యోగులు కాగిత కప్పులు, ఇతర వస్తువులను వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. నగర పాలకసంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో జ్యూట్ బ్యాగుల పంపిణీకి చేస్తున్నామని క్రెడాయ్ ఛైర్మన్ స్వామి తెలిపారు.
ఆచరణ ముఖ్యం
ప్లాస్టిక్ కవర్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జ్యూట్ బ్యాగుల తయారీలను ప్రోత్సహించడం ద్వారానే పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని అదుపుచేసే అవకాశం ఉందంటున్నారు.
ఇదీ చదవండి: