జనవరిలో జరిగిన శాసనమండలి సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు అందరికీ విప్ జారీ చేసింది. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై జరిగిన ఓటింగ్‌లో ఎమ్మెల్సీలు శివనాథ రెడ్డి, పోతుల సునీతలు పార్టీ జారీ చేసిన విప్‌నకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్ బాబు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై రెండుసార్లు విచారణకు రావాలని ఆదేశించగా పోతుల సునీత, శివనాథ రెడ్డిలు గైర్హజరయ్యారు. దీంతో తదుపరి విచారణ రేపు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో శాసన మండలి ఛైర్మన్ విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు విచారణకు హాజరై వాదనలు వినిపించాలని ఎమ్మెల్సీలకు శాసన పరిషత్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు లేఖ రాశారు.
ఇదీ చదవండి: ముంబయిలో స్థానిక రైళ్ల సేవల విస్తరణ.. వారికే అనుమతి