కృష్ణా జిల్లా నూజివీడులోని బైపాస్ రోడ్డు వద్ద పంట కాలువలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. దుర్వాసన రావటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. మృతుడు విస్సన్నపేట మండలం తాత కుంట్ల గ్రామానికి చెందిన కంచర్ల శ్రీనుగా పోలీసులు గుర్తించారు. మృతుడు వంట పని చేసే వాడని బంధువులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: