ETV Bharat / state

రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు.. తర్వాత బెదిరింపులు

ఫైనాన్స్ సంస్థ ఎండీనంటూ పరిచయం చేసుకుంటాడు.. స్టార్ హోటల్ భాగస్వామినని నమ్మిస్తాడు. రుణం ఇస్తానంటూ మాయమాటలు చెప్తాడు. నమ్మి వచ్చినవారిని అందిన కాడికి దోచుకుంటాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమంటే.. ఎంపీ తమ్ముడినంటూ బాధితులను బెదిరిస్తాడు. విజయవాడలో మోసం చేస్తూ లక్షల రూపాయల నగదు వసూలు చేస్తున్న కేశినేని రమేశ్ అనే వ్యక్తి చేతిలో మోసపోయిన బాధితులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Sep 23, 2020, 5:26 PM IST

person cheating in the name of debts in vijayawada
పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

స్టార్ హోటల్​లో మకాం.. సెలబ్రిటీ తరహాలో బిల్డప్.. ఇదీ అతని లైఫ్ స్టైల్. ఫైనాన్స్ కంపెనీ ఎండీనంటూ అందరినీ పరిచయం చేసుకుంటాడు. ఏ రకమైన రుణం కావాలన్నా ఇస్తానంటాడు. మొదట మంచిగా మెలిగి మార్కులు కొట్టేస్తాడు. ఆ మాటలు నమ్మితే ఇక అంతే నిలువుదోపిడీ చేసేస్తాడు. రుణాలు ఇప్పిస్తానంటూ మోసం చేస్తున్న ఘరానా మోసగాడు కేశినేని రమేశ్ అక్రమాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కృష్ణలంకకు చెందిన రుషికేశ్వరరావు బెంగళూరులో వ్యాపారం చేస్తుంటాడు. కరోనా ప్రభావంతో ఆ వ్యాపారం దెబ్బతినటంతో విజయవాడకు వచ్చారు. గుంటూరు జిల్లా నల్లపాడులో తనకున్న 5 వేల గజాల స్థలంపై రుణం తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా కేశినేని రమేశ్ ఫైనాన్సర్​నంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు. గేట్ వే హోటల్​లో భాగస్వామినని, ఎంపీ కేశినేని నాని తమ్ముడినని, హెచ్.ఆర్.ఎం ఫైనాన్స్ ఎండీనని, హైకోర్టులో లాయర్‌నని చెప్పాడు. గేట్​వే హోటల్​లోని ఓ గదిలో తన కార్యాలయం ఉందని నమ్మబలికాడు. ఇదంతా నమ్మిన రుషికేశ్వరరావు తన స్థలంపై రుణం ఇవ్వాలని కోరాడు.

డబ్బులు కొట్టేసే వ్యూహరచన

ఇదే అదనుగా రమేశ్ వ్యూహరచన చేశాడు. ఈ ఏడాది జులై 10వ తేదీన మీ భూమి వెరిఫికేషన్ అయ్యిందని, కోట్ల రూపాయల రుణం ఇస్తానని రుషికేశ్వర్​కు చెప్పాడు. అయితే ముందుగా ఐటీ రిటర్న్స్ కట్టాలంటూ రూ. 4 లక్షలు ఇవ్వాలని అడిగాడు. రుషికేశ్వర్ ఆ డబ్బులు ఇచ్చాడు. అప్పటి నుంచి అదిగో, ఇదిగో అంటూ నెల రోజులు కాలయాపన చేశాడు. దీనిపై బాధితుడు గట్టిగా నిలదీయగా.. మీ స్థలానికి చలానాలు తీయాలని దానికి మరో రూ. 16.70 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అది నమ్మిన బాధితుడు మరోసారి అతను అడిగిన సొమ్ము ఇచ్చాడు. వెంటనే రమేశ్ అతనికి అడ్వాన్స్ రుణంగా రూ. 50 లక్షల చెక్కు ఇచ్చాడు. దీన్ని తీసుకుని రుషికేశ్వరరావు సదురు బ్యాంకుకు వెళ్లగా.. ఆ చెక్కు రెండేళ్ల క్రితం మూసేసిన ఖాతా అని బ్యాంకు వారు చెప్పటంతో నివ్వెరపోయాడు. మోసపోయానని తెలుసుకుని రమేశ్ దగ్గరకు వెళ్లి తన డబ్బు తనకివ్వమని అడిగాడు. దీంతో రమేశ్ తాను ఎంపీ కేశినేని నాని తమ్ముడినని.. డబ్బులు ఇవ్వనంటూ బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కార్ల వ్యాపారి నుంచి మరో రూ. 4.50 లక్షలు

తాడేపల్లి సుందరయ్యనగర్​కు చెందిన శ్రీనివాస్ పాతకార్లను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. అతడి వద్ద తరచుగా రమేశ్ కార్లు కొంటుంటాడు. ఆ పరిచయంతో గత జులైలో తనకు అవసరాల నిమిత్తం రూ. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరాడు . అంతమొత్తం తన వద్ద లేవని శ్రీనివాస్ రూ. 4.50 లక్షలు ఇచ్చాడు. తర్వాత డబ్బులు తిరిగివ్వాలని కోరగా.. బెదిరింపులకు గురి చేశాడని శ్రీనివాస్ తెలిపాడు.

కేశినేని రమేశ్​పై బాధితులు కృష్ణలంక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇవీ చదవండి..

పోలీసుల ఓవరాక్షన్.. పోలీస్ స్టేషన్​లో డిప్యూటీ తహసీల్దార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.