కృష్ణా జిల్లాలో ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘంటసాల, చల్లపల్లి మండలాల పరిధిలోని లచ్చిగాని లంక, పొలాటి లంక, రేగుల్లాంకలో 200గొర్రెలు నదిలో చిక్కుకున్నాయి. రెవెన్యూ అధికారులకు విషయం తెలియగా 3 పడవలు పంపారు. గొర్రెల కాపరులు, స్థానికులు ప్రాణాలకు తెగించి గొర్రెలను పడవలోకి ఎక్కించుకొని ఒడ్డుకు తీసుకొచ్చారు. వెలివోలు గ్రామంలో సుమారు 150 మంది రైతులు సొసైటీ భూముల్లో పట్టు పురుగులు పెంచుతున్నారు. రెండ్రోజులు గడిస్తే పట్టు పురుగులు గూడు కట్టుకునేవని... ఈ వరద కారణంగా షెడ్లు నీటిలో మునిగిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచూడండి.విజయవాడలో అర్ధరాత్రి కారు బీభత్సం..మూడు వాహనాలు ధ్వంసం