మోపిదేవి మండలంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి 2 రాష్ట్రాల ప్రజలు స్వామి వారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ముఖ్యంగా గురువారం నాడు సుమారు పదివేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. కోవిడ్- 19 ఆంక్షల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షల మేరకు... దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా తమ ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, చిరునామా వంటి వివరాలు నమోదు చేసుకున్న అనంతరమే ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
కానీ... మోపిదేవి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది తమ చిన్నారులకు పుట్టు వెంటుకలు తీయించడం, అన్నప్రాసన, కుట్టుపోగులు వంటి మొక్కుబడులు తీర్చుకోటానికే ఉంటారు. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఆలయంలోనికి 10 ఏళ్లలోపు చిన్నారులకు, అలాగే 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు అనుమతి లేదు. అందువల్ల ఆలయానికి వచ్చే భక్తులకు నిరాశే ఎదురవుతోంది. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు చేసేదేమీ లేక తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు... చిన్నారులకు, పెద్దవారికి ఆలయంలోకి అనుమతులు కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
మోపిదేవి ఆలయాన్ని దర్శించుకున్న ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్