ETV Bharat / state

భయం వీడుదాం...ధైర్యంగా ఉందాం. - కృష్ణాజిల్లా ముఖ్యంశాలు

కొవిడ్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో తుమ్ములొచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా కరోనా బారిన పడ్డామేమోనన్న భయంతో జిల్లాలో ఎంతోమంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఇటీవల ఏర్పాటు చేసిన కాల్‌సెంటరుకు వచ్చిన అన్ని సమస్యలూ కరోనా భయంతో కూడినవే ఉండటం క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంత భయపడుతున్నారో తెలియజేస్తోంది.

కరోనా పై వైద్యుల సలహాలు
కరోనా పై వైద్యుల సలహాలు
author img

By

Published : May 6, 2021, 10:49 AM IST

పెడన .. పట్టణంలో ఇటీవల ఎక్కువగా కొవిడ్‌ కేసులు నమోదవడంతోపాటు పలువురు మృతి చెందారు. బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది. గత కొన్ని రోజులుగా గుండెల్లో దడగా ఉండి నిద్రకూడా పట్టడం లేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయాలంటూ ఓ వ్యక్తి మచిలీపట్నంలోని ఆయుష్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆశ్రయించాడు.

నందిగామకు చెందిన మరొకరు ఇటీవల కరోనా పరీక్ష చేయించుకున్నాడు. నెగిటివ్‌ అని నివేదిక వచ్చింది. ఫలితం సక్రమంగా రాలేదేమో.. జాప్యం చేస్తే సమస్య తీవ్రమవుతుందేమోనంటూ మళ్లీ పరీక్ష చేయించుకోవాలా ..ఆందోళన తొలగేదెలా అంటూ కేంద్రాన్ని సంప్రదించాడు.

● మచిలీపట్నానికి చెందిన ఓ మార్కెటింగ్‌ ఉద్యోగి తనకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా కొవిడ్‌ విస్తృతమవుతుందన్న వార్తలు చూసి భయాందోళనతో ఓ వైద్యుడిని సంప్రదించారు. ఎలాంటి లక్షణాలు లేవు ధైర్యంగా ఉండండి అని చెప్పి బలానికి మందులు ఇచ్చి పంపారు. అయినా అనుమానం తీరకపోవడంతో స్నేహితులు మానసిక వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

కొవిడ్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో తుమ్ములొచ్చినా, చిన్నపాటి దగ్గు వచ్చినా కరోనా బారిన పడ్డామేమోనన్న భయంతో జిల్లాలో ఎంతోమంది డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. జిల్లా ఆసుపత్రిలో ఇటీవల ఏర్పాటు చేసిన కాల్‌సెంటరుకు వచ్చిన అన్ని సమస్యలూ కరోనా భయంతో కూడినవే ఉండటం క్షేత్రస్థాయిలో ప్రజలు ఎంత భయపడుతున్నారో తెలియజేస్తోంది. కొవిడ్‌ గురించే ఆలోచించడం, వాటికి సంబంధించిన కథనాలు చూడటం, చదవడం వల్ల చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొదటి దశలో కంటే రెండవ దశలో ఈ ఇబ్బందులు పడేవారు అధికంగా ఉన్నారని అంటున్నారు.

లక్షణాలు ఎలా ఉంటాయి..?

కొవిడ్‌ వస్తుందేమోనన్న అతిభయం, మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవడం, చిరాకు, ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం, అతిజాగ్రత్త, అతి శుభ్రత, చేసిన పని పదేపదే చేయడం, బాధ, దిగులు నిస్సహాయత, చనిపోతానేమోనన్న ఆందోళన లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు ఎక్కువగా పట్టడం, అలసట, మధుమేహం, రక్తపోటులాంటివి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటం, ఏపనీ చేయలేకపోవడం, నిద్రలేమితో బాధపడుతుంటారు. ప్రతికూల ఆలోచనలతో ఉంటారు. మానసిక వైద్యుల వద్దకు వచ్చేవారిలో ఎక్కువగా ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఎందుకు అలా అవుతున్నారు?

అతిగా ఆలోచించడం వల్లే మానసిక వ్యాధికి గురవుతున్నారని వైద్యులు అంటున్నారు. ప్రధానంగా ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోను ఉంటుంది. లేచిన దగ్గర నుంచి ఎక్కువ సమయం దానితోనే గడిపేస్తున్నారు. అదే ముప్పుగా మారుతోంది. ప్రసాదమాధ్యమాల్లో కొవిడ్‌పై వస్తున్న విషయాలను చూసిన వాళ్లు అక్కడితో ఆగకుండా దానిని మరిన్ని గ్రూపులకు, తెలిసిన వాళ్లకు షేర్‌ చేస్తున్నారు. వాటిని చూసి భయాందోళనకు గురై క్రమేపీ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారు. ఇదే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరిచి ఎవరు ఏది చెబితే అది అనుసరిస్తున్నారు. దీనివల్ల శారీరకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పుకార్లకు దూరంగా ఉండి ప్రశాంతంగా ఉంటే చాలా మేలు చేకూరుతుంది.

మరి ఏం చేయాలి ?

ప్రతి ఒక్కరూ కొవిడ్‌ ఆలోచనల నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉందని మానసిక వైద్యులు చెబుతున్నారు.ప్రధానంగా కొంతకాలం సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి. ఆంక్షల కారణంగా ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతున్నందున, వృత్తిపరమైన పనులపై మనసును కేంద్రీకరించాలి. ఖాళీ సమయాల్లో కుటుంబంతో గడపడం, పుస్తకాలు చదవడం, యోగా, ధ్యానంలాంటి వాటిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. రోజూ శారీరక వ్యాయామం కచ్చితంగా చేయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వీలైనంత త్వరగా మానసిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని భయాన్ని అధిగమించవచ్ఛు

ఎదుర్కొందాం. - డా.ప్రభురామ్‌, జిల్లా ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు

కొవిడ్‌ మొదటిదశతో పోల్చుకుంటే రెండో దశలో ఫోబియా పెరుగుతోంది. అది వచ్చిన వాళ్లే కాదు రాని వాళ్లను కూడా ఇది వెంటాడుతోంది. ఇది ఎవరికి వారు కావాలని తెచ్చుకుంటున్న మానసిక రోగం. అక్కడ అంతమంది చనిపోయారు... ఒకే ఊళ్లో ఎక్కువ కేసులు వచ్చాయంటూ ఇలాంటివాటిని ఎక్కువగా చూడడం వల్ల భయం పెరిగిపోతోంది. ఎంతోమంది కొవిడ్‌ను జయించి ఇంటికి వెళ్తున్నారు. ఈవిషయాన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. కొవిడ్‌ను ధైర్యంతోనే ఎదుర్కోగలమని తెలుసుకోవాలి. ఆందోళన చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్ఛు

సలహాలు అడుగుతున్నారు. - డా.జి.శశికళ, విశ్రాంత జిల్లా ఆయుష్‌ అధికారి

జిల్లా ఆసుపత్రిలో ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటరును ఎక్కువమంది వినియోగించుకుంటున్నారు. మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు విజయవాడ, నందిగామ, నూజివీడు తదితర ప్రాంతాల ప్రజలు కూడా ఫోన్‌లు చేసి సలహాలు సూచనలు అడుగుతున్నారు. వచ్చినవాటిలో ఎక్కువమంది కొవిడ్‌ లేకుండానే వస్తుందేమో...వస్తే ఎక్కడికి వెళ్లాలి అన్న భయంతో ఉన్నారు. అలాంటి వారందరికీ అవసరమైన సేవలు అందించడంతోపాటు అందుబాటులో ఉన్న ఆసుపత్రులు, అందిస్తున్న చికిత్స తదితర వివరాలు చెబుతున్నాం. భయాన్ని వీడి ధైర్యంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే త్వరలోనే కరోనాను నియంత్రించవచ్ఛు ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్‌కూడా జరుగుతోంది. ప్రజలు అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం.

ఇవీ చదవండి:

కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

ఈరోజు మీ రాశి ఫలాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.