కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం, చల్లపల్లి గ్రామంలోని పోస్ట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రంలో సిబ్బంది వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా అధార్ కార్డుకోసం చిన్నారులతో వచ్చే వారు గంటల తరబడి కార్యాలయం ముందు పడిగాపులు పడుతున్నారు. ఆధార్ కార్డు నమోదు కేంద్రంలో సిబ్బంది తలుపునకు లోపల గడియపెట్టుకోవడంతో.. ఆధార్‌కు ఫోన్ నెంబరు అనుసంధానించుకోవడానికి, ఇతర మార్పుల కోసం ప్రతి రోజూ వచ్చే వందలాది మంది వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.
ఉదయాన్నే 8 గంటలకు కార్యాలయానికి చేరుకుంటేనే అప్లికేషన్ ఫారం ఇస్తున్నారు. అప్పటి నుంచి అధికారుల కోసం పది గంటల వరకు పడిగాపులు తప్పడంలేదు. గతంలో ఇదే ఆధార్ సెంటర్‌పై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ సిబ్బంది ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదని వినియోగదారులు అంటున్నారు. పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రజలకు ఆధార్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రహదారి కాదది.. పూల దారి