విజయవాడ నగరంలో మార్కెట్ల ద్వారా కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తున్నా ప్రజలు నిబంధనలు పాటించడంలేదు. పూలు, కూరగాయల మార్కెట్ల వద్ద భౌతిక దూరం అనే మాటే కనిపించడంలేదు. వైరస్ వ్యాప్తి అధికమవుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నా అవేవీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ పక్కన ఉన్న పూల మార్కెట్ వద్ద పూలు కొనేందుకు పెద్దసంఖ్యలో జనం గుమిగూడారు. ఇలా అయితే వైరస్ వ్యాప్తిని నియంత్రించలేమంటూ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇవీ చదవండి...