ETV Bharat / state

270 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.. నకిలీ బిల్లుల గుర్తింపు - Machilipatnam news

మచిలీపట్నం కేంద్రంగా కొనసాగుతున్న రేషన్ బియ్యం అక్రమ దందాలో.. భారీ ఎత్తున నిల్వలను అధికారులు గుర్తించారు. సెక్షన్ 6A కింద సివిల్ సప్లైస్ అధికారులు కేసు నమోదు చేశారు.

pds rice caught by police
270 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
author img

By

Published : Jun 17, 2021, 9:56 AM IST

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరోసారి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. గత కొంత కాలంగా మచిలీపట్నం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండగా.. ఇప్పటికే పలుమార్లు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా.. తాతారావు కాలనీలో కందుల జయబాబుకు చెందిన ఇంట్లో పీడీఎస్ (PDS) అక్రమ నిల్వల సమాచారం అందుకున్న క్రైం బ్రాంచ్ పోలీసులు.. సివిల్ సప్లైస్ అధికారులు సంయుక్తంగా దాడి చేపట్టారు. ఇందులో 270 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. బియ్యానికి సంబంధించి బిల్లులు ఉన్నాయని కందుల జయబాబు వాదించగా.. అవి నకిలీ బిల్లులని అధికారులు తేల్చారు. సెక్షన్ 6A కింద కేసు నమోదు చేసామని సివిల్ సప్లైస్ డెప్యూటీ తహశీల్దార్ మల్లిఖార్జునరావు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ఆర్డినెన్స్​ ఫ్యాక్టరీ బోర్డు పునర్వ్యవస్థీకరణ

మద్యం దుకాణంలో చోరీ.. 48 గంటల్లో ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.