లాక్డౌన్ అనంతరం బస్సులు తిప్పేందుకు సిద్ధమవుతున్న ఆర్టీసీ.. విధులకు హాజరయ్యే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణపైనా దృష్టిపెట్టింది. సిబ్బంది కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేలా ముందస్తు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సిబ్బంది బస్సు ఎక్కే ముందు తప్పనిసరిగా చేతులు శానిటైజర్‌తో శుభ్రపరచుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేకంగా పెడల్ శానిటైజింగ్ వ్యవస్థను తయారు చేసింది. వీటిని డిపోల్లోనే ఏర్పాటు చేసి సిబ్బంది తప్పనిసరిగా పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటోంది.
ఇదీచూడండి.