విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గో-ఆధారిత వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో చిరుధాన్యాల వంటల పోటీలను నిర్వహించారు. ఆధునిక ప్రమాదకర ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కోల్పోతున్న ప్రస్తుత తరం వారికి తృణ ధాన్యాలతో రుచికరమైన ఆహారాన్ని ఎలా తయారుచేయవచ్చో తెలిపే విధంగా పోటీలను ఏర్పాటు చేశారు. కొర్ర లడ్డూ.. రాగి బూందీ.. ఊద కట్టే పొంగలి... సామలు కిచిడి... మిలేట్స్ మంచూరియా.. రాగి నూడుల్స్ తదితర వంటలతో మహిళలు తమ ఆరోగ్యకరమైన వంటలను రుచి చూపించారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఫార్ట్యూన్ మురళి కృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చిరుధాన్యాల ఆవశ్యకతను గుర్తించాలని కోరారు.
ఇదీ చూడండి: నోరూరించే చిరుధాన్యాలు... ఆరోగ్యంగా వంటకాలు