సులభతర విధానంలో అగ్నిమాపక శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాల జారీకి ఆన్‌లైన్ విధానం ఉపయోగపడుతుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్ కుమార్ తెలిపారు. అగ్నిమాపక శాఖను పటిష్ఠం చేస్తున్నామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్న ఆ శాఖ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ... ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. నిర్మాణం పూర్తి కావస్తున్న అగ్నిమాపక భవనాలను త్వరలోనే హోంమంత్రిచే ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండీ... రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని... 20నుంచి యాగం