రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్ యార్డుల ద్వారా ఉల్లి పంపిణీ జరుగుతోంది. రెండు రోజులుగా ఆయా ప్రాంతాలకు అధికారులు ఉల్లిపాయలను చేర్పించి మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉంచారు. ఉల్లి పంపిణీలో అధికారులు నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉల్లిపాయల కోసం వచ్చే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకురావాలని ఒక్కో కార్డుకు ఒక కిలో ఉల్లిని పంపిణీ చేస్తామని మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు. కిలో ఉల్లి ధర రూ 25 రూపాయలు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
కనీసం రేషన్ కార్డుకు మూడు కేజీలు ఉల్లిపాయలు అందించి సామాన్యుని చేతికి సబ్సిడీ ఉల్లి చేరేలా చేయాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు,కడప,కృష్ణా,గుంటూరు జిల్లాల్లో భారీగా ఉల్లి కోసం బారులు తీరడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఉల్లిపాయలు పంపిణీ చేస్తున్నారు
ఇవీ చదవండి