విజయవాడలో ఉద్యోగ, వ్యాపార రీత్యా స్థిరపడినవారు సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో మలయాళీ సంఘం నిర్వహించిన ఓనం వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రితో రామ్మోహన్ రావు, మల్లాది విష్ణుకు కేరళ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. మంత్రి చేతుల మీదుగా ప్రవాసీ పెన్షన్ పథకాన్నీ మలయాళీ సంఘం సభ్యులు ఆవిష్కరించారు. కేరళ సంప్రదాయ దుస్తుల్లో యువతులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:ఆకట్టుకున్న క్వీన్ ఆఫ్ వైజాగ్ టైటిల్ పోరు