భవనం కూలి నలుగురికి గాయాలు - latest accident news in krishna dst
పురాతన భవనం కూలి నలుగురికి గాయాలయ్యాయి. కృష్ణాజిల్లా పవిడిముక్కల మండలం విరంకిలాకుల వద్ద ఈ ఘటన జరిగింది. ఉదయం టీ తాగాటానికి కూడలికి వచ్చిన వారు పురాతన భవనం కింద నిల్చున్న సమయంలో ఒక్కసారిగా పైనుంచి భవన పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడ అసుపత్రికి తరలించారు.