బాలిక అత్యాచారం కేసును ఛేదించిన నూజివీడు పోలీసులు - nuzvid police solved the girl rape case
బాలిక అత్యాచారం కేసును నూజివీడు పోలీసులు ఛేదించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా డీఎస్పీ బి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సైకిల్‌పై బాలికను తీసుకెళుతున్న దృశ్యాలు అస్పష్టంగా ఉండడం వల్ల స్థానికుల సాయంతో కేసును ఛేదించారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు.