జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ నటించిన RRR చిత్రం విడుదల.. కరోనా కారణంగా మరోసారి వాయిదాపడిన సంగతి తెలిసిందే. దీంతో.. అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారని.. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గణేష్ అన్నారు.
విజయవాడలో ఎన్టీఆర్ అభిమానులతో.. ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సినిమా వాయిదాతో అభిమానులు నిరాశ పడకుండా వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా పలువురు ఎన్టీఆర్ అభిమానుల్ని సత్కరించారు.
ఇదీ చదవండి: NADENDLA MANOHAR :
'అత్యధిక స్థానాలు గెలిచిన ప్రభుత్వానికి.. ఇంత వ్యతిరేకత నా జీవితంలో చూడలేదు'