కృష్ణా జిల్లా మచిలీపట్నం డివిజన్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ముగిసిందని అధికారులు వెల్లడించారు. 6390 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు ప్రకటించిన అధికారులు.. 225 సర్పంచ్ స్థానాలకు 1069, 2192 వార్డు స్థానాలకు 5330 నామినేషన్లు వేసినట్లు తెలిపారు. నేడు నామినేషన్లపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, ఎల్లుండి అభ్యంతరాల పరిష్కారం చేయనున్నామని వెల్లడించారు.
ఇవీ చూడండి: