ETV Bharat / state

సున్నా వడ్డీ పథకంలో.. ఏదీ వడ్డీ రాయితీ!

author img

By

Published : May 16, 2021, 2:40 PM IST

రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలా సక్రమంగా చెల్లించినా రాయితీ జమకాక అనేకమంది సహకార సంఘాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో అసలు రాయితీ విడుదలయ్యిందా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

రైతులకు అందని రాయితీ
రైతులకు అందని రాయితీ

సాగులో పెట్టుబడి నిమిత్తం అన్నదాతలు సహకార సంఘాలు, కేడీసీసీబీ బ్రాంచిలు, వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఉన్న భూమిని బట్టి వారికి అవసరమైనంత మేరకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న వారికి సున్నా వడ్డీ పథకం వర్తిస్తుంది. 7 శాతం వడ్డీ చెల్లిస్తే కేంద్రం 3, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం చొప్పున రాయితీ ఇస్తుంది. తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ బ్యాంకులకు చెల్లించేస్తుండగా తరువాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని విడుదల చేస్తుంది.

ఇందులో భాగంగానే ఇటీవల 2019-20 రబీ పంటలకు సంబంధించి 56,533 మందికి రూ.15.16 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. దీనిలో అర్హత ఉన్నా చాలామందికి రాయితీ వర్తించలేదని వాపోతున్నారు. ఈ తరుణంలో ఆ సంవత్సరం ఖరీఫ్‌ పంట రుణాల వడ్డీ రాయితీ నిధులు ఇప్పటికీ జమ కాలేదంటూ రైతులు వాపోతున్నారు. సహకార బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకే ఈ సమస్య ఏర్పడిందని, అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు.

ఇవీ సమస్యలు

సహకార సంఘాల ద్వారా తీసుకున్న పంట రుణాల వడ్డీ గత ప్రభుత్వ హయాంలో సంఘాలే చెల్లించేవి. రైతు నుంచి వడ్డీ వసూలు చేయకుండా ఒక్కో సంఘంలో ఎంతమంది రుణాల తీసుకున్నారో వారు చెల్లించాల్సిన వడ్డీ సంఘాలే బ్యాంకుకు చెల్లించి ప్రభుత్వం విడుదల చేసిన తరువాత సర్దుబాటు చేసుకునే వారు. ప్రస్తుత ప్రభుత్వం వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలకే జమ చేస్తామని చెప్పడంతో సంఘాలు రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆ రాయితీ జమకావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఇటీవల విడుదల చేసిన రబీ పంట రుణాలకు సంబంధించి రాయితీ ప్రభుత్వం విడుదల చేయగా కేడీసీసీ బ్యాంకు పరిధిలోని ఆయా సహకారసంఘాలకు చెందిన 46,476మందికి రూ.11.17కోట్లు విడుదల చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ సంగతేంటని అడుగుతున్నారు. గూడూరు మండలం మల్లవోలు సహకారసంఘ పరిధిలో 500 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. వాణిజ్యబ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ జమఅయినా సహకారబ్యాంకు పరిధిలోని కాలేదని చెబుతున్నారు.

స్పష్టత ఇవ్వాలి

ప్రభుత్వం సున్నావడ్డీ నిధులు విడుదల చేస్తున్నట్లు చెబుతుంది. జిల్లాలో ఎక్కువగా ఖరీఫ్‌లోనూ పంట రుణాలు తీసుకుంటారు. గత ఖరీఫ్‌కు సంబంధించిన నిధులు ఇప్పటికీ రైతుల ఖాతాలకు జమకాలేదు. సంఘాల్లో అడిగితే ఇంకా రాలేదంటున్నారు. ప్రభుత్వం నుంచి రావాలా? ఇంకేదైనా సమస్య వల్ల ఆగిపోయాయా అన్నది అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. జూన్‌ నుంచి మళ్లీ పంట రుణాలు తీసుకుంటాం. ముందుగానే బ్యాంకు అధికారులు సమస్యను పరిశీలించి రావాల్సిన వడ్డీ రాయితీ నిధులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. - చీడేపూడి ఏడుకొండలు, మల్లవోలు

రైతుల ఖాతాలకే జమ

పంట రుణాల్లో సున్నా వడ్డీ పథకంలో భాగంగా మంజూరయ్యే వడ్డీ రాయితీ నిధులు నేరుగా రైతుల ఖాతాలకే జమ అవుతాయి. అన్నదాతల వివరాలను ఆయా సంఘాలు ఆన్‌లైన్‌లో సంబంధిత పోర్టల్లో నమోదు చేస్తాయి. ఆ నివేదికను బట్టి ప్రభుత్వం విడుదల చేయగానే నిధులు ఖాతాల్లో జమవుతాయి. ఇంకా జమకాని వారుంటే సంబంధిత బ్రాంచి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని- కేడీసీసీ బ్యాంకు జీఎం చంద్రశేఖర్‌

ఇవీ చూడండి:

డిశ్చార్జ్ అయిన వారికి నగదు ప్రోత్సాహకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.