ETV Bharat / state

సమస్య శాశ్వతం... తాత్కాలిక పరిష్కారం... - విజయవాడలో వరద బాధితులు తాజా వార్తలు

కృష్ణా వరదల్లో ఇళ్లు సహా సర్వస్వం కోల్పోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. నాలుగు నెలలు గడిచినా వారికి శాశ్వత నివాసాల ఊసేలేదు. పిల్లలు, వృద్ధులు బిక్కుబిక్కుమంటూ వాటర్‌ ట్యాంకు కిందే బతుకీడుస్తున్నారు.

no-house
author img

By

Published : Nov 21, 2019, 2:48 PM IST

సమస్య శాశ్వతం... తాత్కాలిక పరిష్కారం...

ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో కృష్ణమ్మకు వరద వచ్చినప్పుడు... ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలు నీటమునిగాయి. విజయవాడలోని కృష్ణలంక వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. తారకరామానగర్‌లో నివాసముంటున్న వాళ్లు ఇళ్లు కోల్పోయారు. దాదాపు నాలుగు నెలలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాసాల్లో తలదాచుకున్నారు. కృష్ణలంకలోని వాటర్‌ ట్యాంకే వారికి పునరావాసంగామారింది.

70 కుటుంబాలు మున్సిపల్ గోడౌన్ వద్ద ఉన్నాయి. ఇదీ సరిపోక చాలా మంది ఆరుబయటే ఉంటున్నారు. ఇన్నాళ్లూ ఎలాగోలా గడిచినా... శీతకాలం వారిని భయపెడుతోంది. వృద్ధులు, చిన్నారులు పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బాధితులకు ఇళ్లు సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు... వివరాలు తీసుకున్నారే కానీ తదుపరి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా దుర్గంధభరితమైన వాతావరణంలో అనారోగ్యకర జీవితాన్ని సాగిస్తున్నారీ వరదబాధితులు.

పునరావాసాన్ని ఖాళీ చేయాలని అధికారులు చేస్తున్న ఒత్తిడితో బాధితుల్ని ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడికి పోవాలని, ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.

నిర్వాసితులకు మౌళిక సౌకర్యాలు కల్పించటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. రాజధానికి సమీపంలోనే పరిస్థితి ఇలా ఉంటే... గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

షూటింగ్ ప్రపంచకప్​లో మనుబాకర్​కు స్వర్ణం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.