ఆర్టీసీలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కారుణ్య నియామక విధానం తీసుకుచ్చింది. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దరఖాస్తు చేసినవారికి ఎన్నేళ్లకు ఉద్యోగం వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 1998 నుంచి 2019 వరకు సుమారు 1900 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 800 మందికే ఉద్యోగాలిచ్చారు. వయసు, విద్యార్హత అంటూ రకరకాల కారణాలతో మరో 11 వందల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
కారుణ్య నియామకాలకు సంబంధించి 2018లో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి..ఆ తర్వాత ప్రక్రియ నిలిపివేశారని బాధితులు చెబుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని వాపోతున్నారు.
'వినతి పత్రాలిచ్చినా లాభం లేదు'
రవాణాశాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీలను కలిశామని, ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వినతిపత్రం ఇచ్చామని.. అయినా ఫలితం లేదని బాధితులు అంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యను పరిస్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: