మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను సమర్ధిస్తూ వాదనలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా పలువురు పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వ పరంగా స్పష్టత ఇచ్చారు.
ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకు వచ్చినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని తగ్గించడంతో నిమ్మగడ్డ రమేశ్ పదవి కోల్పోయారని వాదించారు. నిమ్మగడ్డ రమేష్‌ను ఎస్ ఈసీ పదవి నుంచి తొలగించాలని దురుద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.
ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు కోసం ఆర్డినెన్స్ తీసుకు వచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న ఏజీ...నిమ్మగడ్డ సహా పలువురు వేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్ పై హైకోర్టులో రేపు కూడా వాదనలు కొనసాగనున్నాయి.
ఇవీ చదవండి: