ETV Bharat / state

రేపు గవర్నర్​ ప్రమాణ స్వీకారం..ముస్తాబవుతున్న రాజ్​భవన్ - bishwabhushan harichandan

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్​గా నియమించిన బిశ్వభూషన్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా, ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టుగా ఉన్న భవనం నూతన హంగులతో రాజ్​భవన్​గా రూపుదిద్దుకుంటోంది.

ముస్తాబవుతున్న రాజ్​భవన్
author img

By

Published : Jul 23, 2019, 3:30 PM IST

ముస్తాబవుతున్న రాజ్​భవన్

నూతన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అధికారిక నివాసమైన రాజ్​భవన్ శరవేగంగా ముస్తాబవుతోంది. గతంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంగా, ఆ తర్వాత తాత్కాలిక హైకోర్టుగా ఉన్న భవనాన్ని... రాజ్​భవన్​గా తీర్చిదిద్దుతున్నారు. గవర్నర్ నివాసంలో ఉండాల్సిన వస్తువులు, ఇతర మౌలిక సదుపాయలపై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ వ్యక్తిగత సిబ్బందికి అవసరమైన వసతి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ భవనానికి కలంకారీ హంగులు అద్దాలని.. సంబంధిత అధికారులకు ప్రభుత్వం సూచించింది. రాజ్​భవన్ పనులను గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. రాజ్​భవన్​లో జాతీయ పతాక స్థూపాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో... త్వరితగతిన పనులు పూర్తిచేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.

ఇది చూడండి: సరికొత్త చట్టం... ఇకపై కౌలుదారులే సాగుదారులు!

Intro:ATP:- అనంతలో ఇస్మార్ట్ శంకర్ చిత్రబృందం సందడి చేశారు. చిత్రం విజయోత్సవం సందర్భంగా అనంతపురంలోని మెగా వి టాకీస్ లోని త్రివేణి థియేటర్ లో ఇస్మార్ట్ శంకర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మి, చిత్రం హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు.

Body:ఈ సందర్భంగా వారు అభిమానులతో ముచ్చటీంచారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రతి అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఇస్మార్ట్ శంకర్-2 చిత్రాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తామని, ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని అందించాలని కోరారు. విజయం అనంతరం ఈసారి అనంతపురానికి హీరో రామ్ ని కూడా పిలుచుకొని వస్తామని అని వారు చెప్పారు. చిత్ర బృందంతో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సెల్ఫీలు దిగారు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.