ETV Bharat / state

'ఆనంద వేదిక'లుగా సరస్వతీ నిలయాలు - no bag day

రాష్ట్రంలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం.. విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ప్రణాళికలు రచిస్తోంది. ర్యాంకుల పరుగులో అలసిపోతున్న విద్యార్థులకు నూతనోత్సాహాన్ని అందించేందుకు సమాయత్తమైంది. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తెచ్చి.. 'ఆనందవేదిక'ల్లా మార్చేందుకు నడుం బిగించింది. నో బ్యాగ్ డే అంటూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది.

ఆనందవేదిక
author img

By

Published : Jun 4, 2019, 7:03 AM IST

ఆనందవేదికలు

విద్యాబోధన అంటే చిన్నారుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేలా... లోకజ్ఞానాన్ని నేర్పేలా ఉండాలి. కానీ... కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల ప్రస్తుత పరిస్థితి వేరేలా ఉంది. జ్ఞానాన్ని ప్రసాదించాల్సిన సరస్వతీ నిలయాలు... విద్యార్థులను ర్యాంకుల ఊబిలోకి తోస్తున్నాయి. చిన్నారులను పుస్తక పురుగుల్లా మార్చేసి వారి జ్ఞాపక శక్తిని తినేస్తున్నాయి. ఈ విధానాన్ని మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచే మొదలు

ఇకపై బట్టీ పట్టే పద్ధతులకు వీడ్కోలు చెప్పేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది. స్వేచ్ఛగా చదువుకునే విధంగా విద్యావ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆనంద వేదిక అనే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పరిసరాలపై చిన్నారులకు అవగాహన కలిగించడం... చిన్న చిన్న కథల ద్వారా విద్యార్థుల్లో ఆలోచనా విధానాలు పెరిగేలా చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ఆనంద వేదిక పేరిట పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే పుస్తకాలను సైతం ముద్రించింది. 1,2 తరగతులకు లెవల్ 1... 3,4,5 తరగతులకు లెవల్ 2... 6,7,8 తరగతులకు లెవల్ 3,... 9,10 తరగతులకు లెవల్ 4 పుస్తకాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతి రోజు పాఠశాలల్లో మొదటి అరగంట ఆనంద వేదిక తరగతులు నిర్వహిస్తారు. వీటిని ఏ విధంగా నిర్వహించాలి అనే అంశాలపై ఇప్పటికే 13 జిల్లాల రిసోర్స్ పర్సన్స్​కు శిక్షణ కూడా అందించారు.

శనివారం నో బ్యాగ్ డే

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల రెండు, నాలుగో శనివారాల్లో నో బ్యాగ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. ఆ రెండు రోజులు విద్యార్థులు పుస్తకాల మోతకు దూరంగా కేవలం ఉల్లాసంగా గడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆనంద వేదిక, నో బ్యాగ్ డే లతో ప్రభుత్వ పాఠశాల విద్యా విధానంలో మార్పులు రాబోతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాలు అమలు చేసేందుకు పాఠశాల విద్యా శాఖ సమాయత్తమైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.