వైకాపా పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. తెదేపా నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్నను హత్య చెయ్యడానికి వైకాపా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. హైకోర్టు న్యాయవాది కిషోర్‌పై ఘోరంగా దాడి చేశారని లోకేశ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న లోకేశ్... స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు నామినేషన్ వేయడానికీ వీలు లేదంటూ అరాచకం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఆఖరికి రక్షణగా వచ్చిన పోలీసులపై వైకాపా రౌడీలు దాడి చేసే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయని లోకేశ్ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
ఇదీ చూడండి సాయంత్రంలోగా నామినేషన్లు స్వీకరించకుంటే.. ఎన్నికలు రద్దు చేయండి'