ఒక్క అవకాశం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ని ఆఫ్ఘనిస్తాన్‌లా మార్చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. జగన్ రెడ్డి చేతగానితనాన్ని అలుసుగా తీసుకున్న మృగాళ్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మహిళని అత్యంత దారుణంగా హింసించడమే కాకుండా వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందే ధైర్యం చేస్తుండటం, రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల పేరుతో జరుగుతున్న మోసాన్ని పసిగట్టిన రాక్షసులు రోజుకో ఆడబిడ్డపై తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. నిందితుల్ని పట్టుకొని బెయిల్‌పై అతిధి మర్యాదలతో ఇంటి వద్ద దింపకుండా కఠినంగా శిక్షిస్తేనే అరాచకాలకు బ్రేక్ పడుతుందని విమర్శించారు. నెల్లూరు ఘటనకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ కు జత చేశారు.
ఇదీ చదవండి : somu veerraju: ఈనెల 17 నుంచి 'సేవ - సమర్పణ': సోము వీర్రాజు