ETV Bharat / state

ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా?: లోకేశ్ - నారా లోకేశ్ తాజా వార్తలు

వైకాపా పాలనలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఎంత మంది దళిత బిడ్డలను బలితీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.

nara lokesh
nara lokesh
author img

By

Published : Sep 27, 2020, 10:47 PM IST

చిత్తూరు జిల్లా.. బి కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తెలిపారు. ఎంత మంది దళిత బిడ్డలను సీఎం జగన్ రెడ్డి బలితీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఎస్సీలపై వైకాపా నాయకుల దమనకాండ ఆపాలని డిమాండ్‌ చేశారు.

వైకాపా పాలనలో ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా.. అంటూ ధ్వజమెత్తిన లోకేశ్..‌ నాయకులకు ఎందుకంత అహమని మండిపడ్డారు. జడ్జి రామకృష్ణ కుటుంబాన్ని వెంటాడి, వేధిస్తున్న వైకాపా నాయకులను, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.