జగన్ పారవశ్యంలో... బుగ్గన అసెంబ్లీలో అబద్ధాలను గాలి బుడగల్లా వదులుతున్నరని నారా లోకేష్ తెలిపారు. 11 అక్టోబర్ 2018న చంద్రబాబు ప్రభుత్వం హెల్త్ సెక్టార్లో రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంటే, 15 మే 2019న ప్రపంచ బ్యాంకు ఆమోదించిందని వెల్లడించారు. జగన్ క్లీన్ ఇమేజ్ చూసే ప్రపంచబ్యాంకు ఈ సాయానికి సిద్ధపడిందని బుగ్గన అసెంబ్లీలో బుడగ వదిలారని లోకేష్ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. అప్పటికి ఇంకా ఎన్నికల ఫలితాలు రాకపోయినా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రశ్నించారు. క్లీన్ ఇమేజితో పాలించేస్తారనే వరల్డ్ బ్యాంకు వాళ్ళు ఊహించేశారా... అని ఎద్దేవా చేశారు. "ఆర్థికమంత్రి బుగ్గన ఇన్ని అబద్దాలు ఎలా ఆడగలుగుతున్నారో... ఎందుకైనా మంచిది భజనకి చిడతలు కూడా పట్టుకురండి" అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.
బుగ్గన స్వామిభక్తి రోజురోజుకీ శృతిమించుతోంది: నారా లోకేశ్ - బుగ్గన స్వామిభక్తి రోజురోజుకీ శృతిమించుతోంది
"ఆర్థికమంత్రి బుగ్గన స్వామిభక్తి రోజురోజుకీ శృతిమించుతోంది. బుగ్గన చెప్పింది విన్నాక.. చంద్రయాన్ 2 ప్రయోగం సైతం జగన్ వల్లే విజయవంతమైందని.. అసెంబ్లీలో చెబుతారేమో అనిపిస్తోంది." - నారా లోకేష్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి